ముసునూరు: ప్రసిద్ధ శైవ క్షేత్రం బలివే వద్ద తమ్మిలే రుపై నిర్మించ తలపెట్టిన వంతెన చెక్ డ్యామ్ నిర్మాణానికి నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు భూములు గురువారం పరిశీలన చేశారు. రూ. 18. 33 కోట్ల జలవనరుల శాఖ నిధులతో నిర్మించ తలపెట్టిన చెక్ డ్యామ్ కం డబుల్ లేన్ బ్రిడ్జికి మార్చి 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దెందులూరులో వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో బలివే వంతెన నిర్మాణానికి తొలి అడుగులు పడ్డాయి. మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇం జనీరు కడియాల రవి నేతృత్వంలో బృందం వం తెన నిర్మాణానికి నిర్మాణ నమూనా (డ్రాయింగ్) పూర్తి చేసి స్థల పరిశీలన చేశారు. ఇప్పటికే వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తుండగా, సాంకేతిక పరిస్థితులను పరిశీలించేం దుకు జలవనరుల శాఖ ఉన్నతాధికారుల రాకతో బ్రిడ్జి పనులు ఊపందుకుంటున్నట్లు భావిస్తు న్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రావు ప్రవీణ సుధా కర్, డీసీఈ వెంకటరమణ, ఏలూరు సర్కిల్ ఎస్. ఈ కె. శ్రీనివాసరావు, డీఈఈ దేవప్రకాష్, డీఈ విఎస్ ఆర్ ఆంజనేయులు, బి. శ్రీనివాస్, తమ్మిలేరు ఏఈఈ ప్రిసిల్లా, స్థానికులు పాల్గొన్నారు.