వీరులపాడు మండలంలోని దొడ్డదేవరపాడు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ - స్థానిక సమస్యలను తెలుసుకుంటూ , పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ రాష్ట్రప్రభుత్వం పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందిస్తుందని, కులమతాలు, రాజకీయాలు , పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చటమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ లక్ష్యమన్నారు. అవినీతి రహిత పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే ప్రజలు మరలా తిరిగి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడి పరిపాలనలో రాష్ట్ర ప్రజలను దోపిడి చేసి జన్మభూమి కమిటీల పేరుతో అరాచకం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలనకు. నేటి పాలనకు గల వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలన్నారు. నేడు వైయస్ జగన్ హయాంలో ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందని చెప్పారు. తెలుగుదేశం హయాంలో పథకాల కోసం ప్రజలు కాళ్లు అరిగేలా తిరిగారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెండ్యాల రామకృష్ణ, ఎంపీటీసీ తోట నారాయణరావు, ఎంపీపీ కోటేరు లక్ష్మి ముత్తారెడ్డి, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు, సొసైటీ అధ్యక్షులు తోట శ్రీను, కనకం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.