ఇబ్రహీంపట్నం - కొండపల్లి మున్సిపాలిటీ 2వ వార్డు సచివాలయం పరిధిలో వాలేంటరిగా విధులు నిర్వహిస్తున్న రాచాబత్తుల నాగలక్ష్మి ఆమె భర్త అయినటువంటి వీరవెంకట ప్రసాద్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని రాష్ట్ర మంత్రి వర్యులు జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ వద్ద బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేయగా, యువనాయకులు జోగి రాజీవ్ 10 వేల రూపాయలు ఆర్ధిక సాయం శుక్రవారం అందించి సీఎం రిలీఫ్ ఫండ్ అందేలా చూసి, కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.