విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా విలేకరుల బృందం గురువారం తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువు ఎస్ఐ మధురామచంద్రునికి ఫిర్యాదు చేశారు. ములకలచెరువులో ఇటీవల వైసిపి, టీడీపీ నాయకులు గొడవపడ్డ విషయం తెలిసిందే. కవరేజీకి వెళ్ళిన పాత్రికేయులపై వైసిపి నాయకులు సెల్ ఫోన్లు లాక్కొని దాడికి పాల్పడ్డారని ఈ విషయమై బాధితుల తరపున జిల్లాలోని జర్నలిస్టు నాయకులు ఎస్ఐకి ఫిర్యాదు చేశారు.