తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం పిహెచ్సి పరిధిలో కొత్తగా ఎంపికైన నలుగురు ఆశావర్కర్లకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం నియామకపు ఉత్తర్వులను అందజేశారు. నారాయణవనం 1 సచివాలయంకు ఏ. రేఖ, నారాయణవనం 3కు పి. మంజుల, కీలగరం సచివాలయంకు రమ్య, కొండలచెరువు సచివాలయంకు కవితలకు ఉత్తర్వులు అందించారు. జాతీయ వైద్య ఆరోగ్య సేవలను ప్రజలకు మెరుగైన రీతిలో అందించాలని ఎమ్మెల్యే కోరారు. జడ్పిటిసి కోనేటి సుమన్, ఎంపీపీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.