ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతని మరణానికి కారణం మంత్రే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 19, 2023, 12:24 PM

రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి సురేష్‌ దాష్టీకానికి నిరుపేద దళితుడు మృతి చెందాడని టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజి ఆరోపించారు. ఎర్రగొండపాలెంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో గాయపడిన రాజయ్య బుధవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రాజయ్య అంత్యక్రియల నేపథ్యంలో టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ, కందుకూరు ఇన్‌చార్జ్‌ ఇంటూరి నాగేశ్వరరావు, కనిగిరి ఇన్‌చార్జ్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు తదితరులు చిన్నగుడిపాడు గ్రామం చేరుకున్నారు. రాజయ్యకు నివాళులుల అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజి మాట్లాడుతూ దళితులకు న్యాయం చేయాలంటూ అనవసర రాద్ధాంతం చేసి నిరుపేద దళితుడి మృతికి మంత్రి సురేష్‌ కారణమయ్యారని ఆక్షేపించారు. రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి స్థాయిని మరిచి విధ్వేషాలు రెచ్చగొట్టాడన్నారు. నిస్సిగ్గుగా చొక్కా విప్పి రాళ్లతో దాడులను ప్రోత్సహించాడన్నారు. ఏ మాత్రం బాధ్యత ఉన్నా.., మంత్రి బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com