విజయవాడ హనుమాన్‌పేట ఫుట్‌పాత్‌పై నివశిస్తున్న దంపతులు ముద్దాని రాముడు, కోటమ్మలు చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి కోటమ్మకు గుర్తుతెలియని మహిళ పరిచయమై రేషన్‌కార్డు ఇళ్ల స్థలం ఇప్పిస్తానని నమ్మబలికి తనతో రావాలని కోరింది. దీంతో కోటమ్మ గురువారం హనుమాన్ పేట నుంచి నాలుగు నెలల పసిబిడ్డ జాన్‌పాల్‌ను తీసుకుని మహిళతో కలిసి మూడుసార్లు ఆటో మారి కొండపల్లి ఖిల్లా రోడ్‌కు చేరుకుంది. వీరి వద్దకు గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై రావటంతో పనిచూసుకుని వస్తామని చెప్పి బాలుడ్ని వెంటబెట్టుకుని బైక్‌పై వెళ్లిపోయారు. ఎంత సేపటికి తిరిగి రాకపోవటంతో కోటమ్మ పరిసర ప్రాంతాల్లో వెతికింది. గుర్తుతెలియని వ్యక్తుల ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి పసిబిడ్డ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలో బాలుడితో వెళుతున్నట్టు గుర్తించినట్టు సమాచారం.