గన్నవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీలో బీజేపీ కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాను ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీజేపీ జాతీయ నాయకులు దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 30తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 9 సంవత్సరాల పాలన పూర్తికానుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పధకాలు, సాధించిన విజయాలపై చర్చించనున్నారు. 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కార్యక్రమాల రూపకల్పనపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై దశలవారీగా ఛార్జిషీట్‌లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, సునీల్ దేవధర్, దగ్గుబాటి పురంధరేశ్వరి, సత్యకుమార్, జీవీఎల్ పాల్గొన్నారు. అయితే ఇతర కార్యక్రమాల బిజీ కారణంగా కేంద్ర మంత్రి మురళీధరన్ సమావేశానికి గైర్హాజరయ్యారు.