మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. గత విచారణ సమయంలో ట్విస్ట్ ఇచ్చిన మాదిరిగానే.. నేడు కూడా అదే ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం. సీబీఐ కార్యాలయానికి బయలుదేరినట్టే బయల్దేరి.. మార్గమధ్యలోనే హుటాహుటిన ఆయన పులివెందుల దారి పట్టారు. ఎంపీ తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యంతో పులివెందుల ఆసుపత్రిలో చేరారని ఫోన్ రావడంతో ఆయన పులివెందులకు బయలుదేరారు. కాాగా శ్రీలక్ష్మికి గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది. గత విచారణ సమయం(ఈ నెల 16న)లోనూ అవినాష్ రెడ్డి అలాగే చేశారు. విచారణకు హాజరవుతున్నట్టుగా కారులో బయలుదేరి వెంటనే పులివెందుల దారి పట్టారు. ఈ పరిస్థితుల్లో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? అనేదానిపై సర్వత్రా అవినాష్ అనుచరుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.