పురస్కారాలు అందుకుంటున్న వాలంటీర్లు మరింత స్పూర్తితో చక్కగా పనిచేయాలని, జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్ అనే నినాదంలో మనం గొంతుకలుపుదాం, వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ మళ్ళీ సీఎం చేద్దామని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. విజయవాడలో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు.