ఈనెల 22వ తేదీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మినీ మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తెలిపారు. పెద అమిరం లిబర్టీ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న స్థలంలో జరుగుతున్న మినీ మహనాడు ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ.... మినీ మహానాడు సభకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ, టీడీపీ జోన్–2 ఇన్ చార్జి ప్రత్తిపాటి పుల్లారావులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారన్నారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.