ప్రకాశం జిల్లా జిల్లెళ్లపాడు గ్రామంలో కోట రాధ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. రాధ తన స్నేహితుడు కౌశిరెడ్డికి రూ.50 లక్షలు అప్పు ఇవ్వగా తిరిగివ్వలేదు. డబ్బులిస్తాను రావాలని చెప్పడంతో వెళ్లిన రాధను దుండగులు కొట్టి కారుతో ఆమె కాళ్లు, ముఖం పై నుంచి పోనిచ్చి హత్య చేశారు. రాధ భర్త కోట మోహన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని కోదాడ. వీరు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. సంచలనంగా మారిన ఈ హత్య పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.