ఉత్తరప్రదేశ్లోని నొయిడాలో దారుణం చోటుచేసుకుంది. సెక్టార్ 70 అషియానా హోమ్స్ భవనంలో ఓ మహిళ పార్కింగ్ విషయంలో అక్కడున్న సెక్యూరిటీ గార్డుతో గొడవ పడింది.ఈ క్రమంలో అక్కడి నుంచి వెళ్లిపోయిన మహిళ కొద్దిసేపటి తర్వాత రౌడీలను వెంటపెట్టుకుని వచ్చింది. రౌడీలు సెక్యూరిటీ గార్డును దారుణంగా చితక్కొడుతుంటే ఆమె అది చూసి పైశాచిక ఆనందం పొందింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నమోదయ్యాయి.