కర్నూలు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురైనట్లు జైలు అధికారులు గుర్తించి శుక్రవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అఖిలప్రియకు డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించారు. జైలు అధికారులు రిపోర్టు కోసం వేచిచూస్తున్నారు. ఏవి సుబ్బారెడ్డిపై దాడి కేసులో భూమా అఖిలప్రియకు 14 రోజులు కోర్టు రిమాండ్ విధించిన విషయం విదితమే.