ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రుదౌలీలోని భెల్సర్ స్క్వేర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో రెస్టారెంట్ కాలిబూడిదైంది. దీంతో రెస్టారెంట్ లోని కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేసింది.