ప్రతి విద్యార్థి ఆంగ్లంలో నైపుణ్యం సాధించాలని, అప్పుడే చదువులో ముందుండటంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఉపాధ్యాయుడు రవికుమార్ విద్యార్థులకు సూచించారు. కడప నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న గ్రంథాలయ వేసవి శిబిరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం 12వ రోజు 80 మందికి పైగా విద్యార్థులకు ఆంగ్ల బోధన, ఫిజిక్స్, పెయింటింగ్, క్రాఫ్ట్ శిక్షణపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు సులభ రీతిలో ఆంగ్లంలో మాట్లాడటం, రాయడం, వినడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. వేసవి శిబిరంలో విద్యార్థు లకు వేసవి తాపం నుంచి ఉపశమనం కొరకు రోజూ మజ్జిగ, రస్నా ఇస్తున్నట్లు గ్రంథపాలకులు సుబ్రమణ్యం, నవాబ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ గ్రంథ పాలకులు పవనకుమార్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.