శుక్రవారం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియం హాల్లో గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి సెల్వరాజన్, శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి, బొబ్బిలి శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పల నాయుడు, రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు, శాసనమండలి సభ్యులు డాక్టర్ పెనుమత్స సురేష్, ఇందుకూరి రఘురాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో పురస్కారాలు పొందిన 9, 997 మంది వాలంటీర్లకు 10 కోట్ల 22 లక్షల రూపాయల మెగా చెక్కును అందజేశారు. అనంతరం సేవా వజ్ర పొందిన వాలంటీర్లను సాలువాతో సత్కరించి సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.