యువత సన్మార్గంలో పయనించి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్. ఐ అప్పారావు తెలిపారు. జన జాగృతిలో భాగంగా సారవకోటలో యువతకు వాలీబాల్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. క్రీడలతో మానసికోల్లాసం వస్తుందన్నారు. ఈ పోటీల్లో 8 జట్లు పాల్గొనగా సారవకోట జట్టు ప్రథమ, ధర్మలక్ష్మీపురం జట్టు ద్వితీయ స్థానాలు పొందాయి, విజేతలకు శనివారం బహుమతి అందించనున్నట్లు ఎస్ఐ తెలిపారు.