ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి 16 రోజులపాటు సెలవులో వెళ్లారు. వ్యక్తిగత పనుల మీద ఆయన విదేశాలకు వెళ్లడంతో ఈ నెల 18 నుండి జూన్ 3 వరకు 16 రోజులపాటు ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. ఆయన స్థానంలో శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్జీకి ఇన్ ఛార్జ్ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాజేంద్రనాథ్ తిరిగి వచ్చాక యథాస్థానంలో కొనసాగనున్నారు.