నూనె, గ్రీజు మరకలు తొలగించడానికి నిమ్మ, ఉప్పు ఉపయోగించవచ్చు. నిమ్మకాయను కోసి అందులో ఉప్పు వేసి మరకపై రుద్దాలి. ఇది నిమిషాల్లో బట్టలపై ఉన్న మరకలను తొలగిస్తుంది. బట్టలపై పాన్ మసాలా లేదా ఇతర మరకలను తొలగించడానికి పెరుగును ఉపయోగించవచ్చు. అలాగే కాస్టిక్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. మెుండి మరకలను శుభ్రం చేయటానికి కిరోసిన్‌లో ముంచిన గుడ్డను మరకలు పడిన ప్రదేశంలో అప్లై చేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత దాన్ని బయటకు తీసి డిటర్జెంట్‌తో శుభ్రం చేయాలి.