గుత్తి మండలంలోని బసినేపల్లి తండా గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. కర్నూలు జిల్లా తుగ్గలి గ్రామానికి చెందిన రాజు ద్విచక్ర వాహనంపై గుత్తికి వస్తుండగా బసినేపల్లి తండా గ్రామం వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే అతడిని చికిత్సలు నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.