తెనాలి పట్టణానికి చెందిన నండూరి కృష్ణ, లలితా దంపతులు బైక్ పై గత గురువారం పెదకాకాని శివాలయానికి వచ్చారు. తిరిగి ఇంటికి వెళుతుండగా రాత్రి వారి బైక్ పెదకాకాని పెట్రోల్ బంకు సమీపంలో చేరుకునేసరికి వెనకనుంచి బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మెడలో బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు. బైక్ పైనుంచి కింద పడిన కృష్ణ దంపతులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొంది అనంతరం పెదకాకాని పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బండారు సురేష్ బాబు తెలిపారు.