ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెంలోని ఆలయాల్లో గంటల చోరీ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత సోమవారం ఆర్అండ్ రోడ్డు పక్కనే ఉన్న శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో పట్టపగలే 15 గంటలను దొంగలు చోరీ చేశారు. గురువారం అదే గ్రామంలోని రామాలయం, ఆంజనేయస్వామి, లింగమయ్య స్వామి దేవాలయాల్లో మరో 10 గంటలు చోరీ చేశారు. శుక్రవారం ఇద్దరు యువకులు బైక్సై వచ్చి చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ కార్యదర్శి రంగారెడ్డి తెలిపారు.