ప్రభుత్వం పేదలకిచ్చిన నివేసన స్థలాలపై వారిని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు దిష్టిబొమ్మను వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని రాజ్యలక్ష్మి థియేటర్ సెంటరులో దగ్ధం చేశారు. సెంటు భూమి సమాధులకు సైతం చాలదంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, రూరల్ కన్వీనర్లు గడ్డం రాధాకృష్ణమూర్తి, గాదె వెంకయ్యబాబు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మండలి అంజయ్య, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కార్పొరేషన్ల డైరెక్టర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.