మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన నాగుల్‌మీరా నకరికల్లులో ఉంటున్నాడు. ఈనెల 17న స్వగ్రామానికి వచ్చి, ఆవులగడ్డ ప్రాంతంలో స్థానికుడు పుల్లారెడ్డితో కలిసి టీ తాగుతుండగా. అదే గ్రామానికి చెందిన పొట్టి వెంకయ్య, శివయ్య, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మయ్య, మరికొంతమంది కర్రలు, గొడ్డళ్లతో దాడి. చేశారు. ఈ ఘటనలో నాగుల్‌మీరా కాలు, భుజానికి గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.