కుప్పం మండలం కోటాలూరు గ్రామానికి చెందిన సుకుమార్ తిలక దంపతులకు సొంత ఇల్లు లేకపోయినా పంచాయతీ అధికారులు ఇంటి పన్ను కట్టాలని రసీదు ఇచ్చారని శనివారం వారు ఆవేదన వ్యక్తం చేశారు. లేని ఇంటికి పన్ను ఎలా కట్టాలో అధికారులు చెప్పాలని ఆ దంపతులు ప్రశ్నిస్తున్నారు. ఇక సుకుమార్ కు వస్తున్న వికలంగ పెన్షన్ సైతం తొలగించారంటూ బోరుమంటున్నాడు. అధికారులు చొరవ చూపి తనకు న్యాయం చేయాలని సుకుమార్ కోరుతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa