కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా ప్రమాణం చేశారు. వీరితో పాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీష్‌తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు, సినీనటులు హాజరయ్యారు.