జమ్మూకశ్మీర్ లో జరగనున్న జీ20 సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. వివాదాస్పద భూభాగంలో ఇలాంటి భేటీలు జరపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చైనా తెలిపింది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. 'సొంత భూభాగంలో ఎక్కడైనా భారత్ స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహిస్తుంది. చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి సరిహద్దుల వెంబడి శాంతి, సుస్థిరత అవసరం' అని స్పష్టం చేసింది.