నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా కందిపప్పు ధర అమాంతం పెరిగింది. మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రూ.140కి చేరింది. జూన్ నాటికి ఈ ధర మరింత పెరుగుతుందని అంటున్నారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. 2022 లో దేశంలో 43.4 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు పండగా ఈ ఏడాది దిగుబడి 38.9 లక్షలు కూడా దాటకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి.