మహిళా మల్లయోధులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ ని తక్షణం అరెస్టు చేసి, హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, కార్మిక, మహిళాసంఘాలఆధ్వర్యంలోశనివారంకాకినాడలోసుందరయ్యభవన్, నుండిర్యాలీనిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడకొండ, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి, టీ. ఎన్. టి. యు. సి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ మాట్లాడారు.