విశాఖ మహారాణి పేట లిమిట్స్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని ప్రియుడు హత్య చేసిన ఘటన శనివారం వెలుగు చూసింది. ఈమేరకు కె. శ్రావణి ( 27 )అనే వివాహితను పరవాడకు చెందిన గోపాలకృష్ణ అనే యువకుడు హత్య చేసినట్లు తెలుస్తుంది. అర్థరాత్రి మూడు గంటల సమయంలో శ్రావణి గోపాలకృష్ణ బీచ్ కు వచ్చారు. ఈక్రమంలో ఇరువురు మధ్య వాగ్వదం జరగడంతో గోపాలకృష్ణ శ్రావణిని హత్య చేసాడు. మృతురాలు జగదాంబలో ఓ షాపింగ్ మాల్ లో పని చెస్తున్నట్లు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి సమీక్షించారు. ఇదిలా ఉండగ హతుడు గాజువాక పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.