తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శనివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి, ఏవీఎస్ ఓ సైలేంద్రబాబు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.