మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని మొలకలచెరువు ఎస్ఐ మధు రామచంద్రుడు హెచ్చరించారు. ములకలచెరువు మండలంలో వాహనాలను తనిఖీ చేసి ప్రమాదాల నివారణ పై డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమన్నారు. వాహనాలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల న్నారు. వాహనదారులు రికార్డులు సక్రమంగా ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.