ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం నాగేళ్ల ముడుపు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు.