తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో ఆవుల వ్యాపారి హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రెండు రోజుల క్రితం ఆర్థిక లావాదేవీల కారణంగా పిచ్చాటూరుకు చెందిన మునస్వామిని తమిళనాడు రాష్ట్రానికి చెందిన బాలు, మణి అనే ఇద్దరు నాగలాపురం వద్ద హత్య చేశారని తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి రూ. 90 వేలు నగదు, ఫోన్, హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు.