అనకాపల్లి డి. ఎస్. పి సుబ్బరాజులు ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ చిన్నియాదవ్, అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ అనకాపల్లి పట్టణంలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన డీఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది.