విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి నెవల్ డాక్ యార్డు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు గోస్తని గేటు వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వాటికి స్వల్పగాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కారు ముందుభాగం తీవ్రంగా దెబ్బతినింది.