పాక్ ప్రభుత్వం నిషేధం విధించిన పాకిస్థాన్ తాలిబన్ మిలిటెంట్ల గ్రూపు తాజా హిట్‌లిస్టులో పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లు ఉన్నారు. ఈ మేరకు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా, పాకిస్థాన్ ముస్లింలీగ్ (నవాజ్) పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్లతోపాటు పలువురు మిలటరీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు, సీనియర్ ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు ఉన్నాయి.