విశాఖ ఆర్కే బీచ్లో కొత్త ఆంక్షలు అమలయ్యాయి. ప్రతి రోజు రాత్రి 10 గంటలకల్లా షాపులన్నీ మూసివేయాలని విశాఖ నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి చాలా షాపులను దగ్గరుండి పోలీసులు మూయించివేశారు. ఆర్కే బీచ్ లో అర్ధరాత్రి వరకు షాపులు తెరిచి ఉండడంతో నగరంలో గొడవలకు ఆర్కే బీచ్ వేదికగా మారుతోంది. విశాఖ నగరంలో రాత్రిపూట ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకు తొలి చర్యగా బీచ్ సమీపంలో షాపులపై పోలీసు కమిషనర్ ఆంక్షలు విధించారు.