విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన ఘటన తాటిచెట్లపాలెంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. దివ్యభాయ్ అనే మహిళ(49) గృహిణి. భర్త రాడ్బెండింగ్ పనిచేస్తుంటాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. శనివారం ఉదయం బట్టలు ఉతికి ఇంటి ముందు ఉన్న ఇనుపచువ్వపై ఆరేసింది. ఆ క్రమంలో ఇనుపచువ్వకు విద్యుత్తు ఉండటంతో అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలా నికి చేరుకుని పరిశీలించారు. ఎస్ఐ గౌరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa