రోగిని తరలిస్తున్న అంబులెన్సు అదుపుతప్పి బోల్తా పడ్డ ఘటన ఉత్తరప్రదేశ్ లోని చందౌలీ జిల్లాలో జరిగింది. షహబ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని డుమ్రీ గ్రామం సమీపంలో రోగిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్సు అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోగితో పాటు మరో నలుగురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa