సమాజంలో ప్రతి విద్యార్థి కీ పుస్తక పఠనంతో పాటు, మహనీయులు జీవిత ఘట్టాలు తెలుకోవాలి , అంతేకాకుండా తల్లిదండ్రులు మరియు బంధువులతో మంచిగా మెలుగుతూ ప్రతి విద్యార్థి సామాజిక దృక్పథం కలిగి ఉండాలి జి. సత్యనారాయణ సత్తెనపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి. ఆదివారం ఉదయం 10 గంటలకు , సత్తెనపల్లి పట్టణములోని మెయిన్ రోడ్డులో ఉన్న శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఆర్యవైశ్య సేవా సమితి అధ్యక్షులు వెలుగురి శరత్ బాబు ఆధ్వర్యంలో, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రవేటు పాఠశాల్లో వారి , వారి స్కూల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి , విద్యార్థునులకు అభినందన సభ మరియు చిరు సత్కారంతోపాటు జ్ఞాపిక ను అందించారు, మొత్తం 22 స్కూల్లో ఉన్న వారికి 22 మందికి మరియు మరో 5 గురు సత్తెనపల్లి పట్టణానికి చెంది వేరే ఊర్లో పదవ తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన వారికి మొత్తం 27 మందికి చిరు సత్కారం జరిగింది. ముందుగా సభా కార్యక్రమం నిర్వహించారు. సభాఅధ్యక్షులుగా ఆర్యవైశ్య సేవా సమితి అధ్యక్షులు వి. శరత్ బాబు వహించగా , సభా పరిచయం ప్రధాన కార్యదర్శి దివ్వెల శ్రీనివాసరావు గావించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సత్తెనపల్లి ఎమ్. పి. డి. జి సత్యనారాయణ, సత్తెనపల్లి ఎమ్. ఈ. ఓ ఏ. శ్రీనివాసరావు, ఎలక్ట్రల్ ఈ. ఈ టి. లోక్ నాథ్ గుప్తా, సత్తెనపల్లి సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ఏ. పి. పి బగ్గి నరసింహరావు , తదితరులు అద్భుతమైన ప్రసంగాన్ని అందించారు.