పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ని దర్శించుకొని పూజలు నిర్వహించిన సత్తెనపల్లి మాజీ శాసన సభ్యులు వై వి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఆదివారం రాత్రి గ్రామస్థులు, తెదేపా అభిమానులు ఆహ్వానం మేరకు సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు వై వి ఆంజనేయులుకు గ్రామస్థులు, యువత సాదర స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములతో స్వామి వారి అశీస్సులు అందజేశారు. తిరునాళ్ల ను పురస్కరించుకొని గ్రామస్థులు ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ ప్రభలను సందర్శించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వై వి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఏడాది రైతులు గ్రామస్థులు కులాలకు, మతాలకు వర్గాలకు పార్టీ లకు అతీతంగా ఐక్యతా భావంతో సమిష్టిగా శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవటం. మీ సంతోష సంబరాలలో మేమందరం భాగస్వామ్యం అయ్యే అవకాశం కల్పించిన గ్రామస్థులందరికి అభినందనలు తెలియజేశారు. రానున్న ఏడాది పాడి పంటలతో రైతు సోదరులు, గ్రామస్తులు ప్రతి కుటుంభం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆ పోలేరమ్మ తల్లిని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ల మండల పార్టీ అధ్యక్షులు బత్తుల నాగేశ్వరరావు సర్పంచులు చంద్రశేఖర్, యల్లమంద, యర్రంనీడి నవీన్, , గరికపాటి చంద్రం, గ్రామస్తులు, భక్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.