పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఐదు ఎకరాల మగాణి భూమి చేబ్రోలు మండలం చేకూరు శివారు వీరనాయకుని పాలెం , దేవరాయబొట్లవారి పాలెం లో ఉన్న భూమిని 2023- 24 సంవత్సరాని గాను కౌలు సాగు చేసుకునేందుకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో పెదకాకాని శివాలయంలో కౌలు వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిషనర్ నల్ల కాల్వ శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఈ వేలం పాటలో పాల్గొనాలని మరిన్ని వివరాలకు దేవస్థానం కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa