దుర్గి మండల పరిధిలోని పోలేపల్లి గ్రామ సర్పంచ్‌గా దేశం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత గ్రామ సర్పంచ్‌పై ఉందన్నారు. అనంతరం నూతన సర్పంచు సత్కరించారు.