వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి అధికారులు ఈరోజు బులెటిన్ విడుదల చేశారు. కాగా, విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవినాష్ రెడ్డి తల్లిని వైఎస్ విజయమ్మ పరామర్శించారు. లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అవినాష్ రెడ్డి తల్లి త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.