ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ హైకోర్టు బీబీసీకి నోటీసులు జారీ

national |  Suryaa Desk  | Published : Mon, May 22, 2023, 08:46 PM

ఢిల్లీ హైకోర్టు బీబీసీకి నోటీసులు జారీ చేసింది. 'ఇండియా: మోదీ క్వశ్చన్' పేరుతో రెండు భాగాల డాక్యుమెంటరీని ప్రసారం చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. డాక్యుమెంటరీతో దేశం పరువు తీశారంటూ బీబీసీపై గుజరాత్‌కు చెందిన 'జస్టిస్ ఫర్ ట్రయల్' అనే ఎన్జీవో పరువు నష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ సచిన్ దత్తా వివరణ ఇవ్వాలని బీబీసీకి ఈరోజు నోటీసు ఇచ్చారు. డాక్యుమెంటరీని విడుదల చేసిందని పరువు నష్టం దావాలో పేర్కొంది. ఎన్జీవో తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. డాక్యుమెంటరీ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా, న్యాయ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని దావాలో పేర్కొన్నారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 15న జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com