దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు... ఆ తర్వాత కొనుగోళ్లతో కోలుకున్నాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 234 పాయింట్లు లాభపడి 61,964 వద్ద ముగిసింది. నిఫ్టీ 111 పాయింట్లు పుంజుకుని 18,314 వద్ద నిలిచింది. నేటి ట్రేడింగ్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టెక్ మహీంద్రా (3.03%), విప్రో (2.50%), టీసీఎస్ (2.37%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.18%), ఇన్ఫోసిస్ (1.91%).
టాప్ లూజర్స్ : నెస్లే ఇండియా (-1.15%), యాక్సిస్ బ్యాంక్ (-0.79%), భారతీ ఎయిర్టెల్ (-0.50%), టాటా మోటార్స్ (-0.46%), హెచ్డిఎఫ్సి లిమిటెడ్ (-0.43%).