దక్షిణ అమెరికాలోని గయానాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జార్జ్‌టౌన్‌లోని ఓ స్కూల్ హాస్టల్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులంతా 12- 18 ఏళ్ల పిల్లలేనని, ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపింది.