జార్ఖండ్‌లోని రాంచీ రిమ్స్ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. నవజాత శిశువులు తక్కువ బరువుతో ఉండటంతో వారిని ఎన్ఐసీయూలో ఉంచామని వైద్యులు చెప్పారు. ఐదుగురు శిశువులు ఆరోగ్యకరంగా ఉన్నారని, వారిని పరిశీలన కోసం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచామని వైద్యులు వివరించారు.